హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతం అయ్యారు. మేఫెయిర్స్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోర్టిక్ రూట్, అసెండింగ్ అయోర్టిక్ అనూరిజం తీవ్రమైన అయోర్టిక్ సంబంధ రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న 28 ఏళ్ల పేషేంట్ ఉరిటి అనిల్ కుమార్‌కు బెంటాల్స్ శస్త్రచికిత్సను నిర్వహించారు.రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించగా వాటిలో వాల్వ్ పనిచేయకపోవడం వంటి డైలేటెడ్ హార్ట్ చాంబర్ సమస్య ఉన్నట్టు గుర్తించినట్టు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా తెలిపారు.