నియోజకవర్గ కేంద్రమైన ఉండి నుంచి కాళ్ళ మండలం మల్లవానితిప్ప గ్రామం వరకు 24 కిలోమీటర్లు మేర చేపట్టే బొండాడ కాలువ ప్రక్షాళన పనులను కాలమండలం జక్కరం గ్రామంలో అసెంబ్లీ ఉప సభాపతి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ గట్లను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మూడు వారాల్లో తొలగింపు పనులను పూర్తి చేసి 19 అడుగుల గట్టు రహదారి ఏర్పాటు చేయాలని జలవనురుల శాఖ అధికారులకు నీటి సంఘాల అధ్యక్షులకు ఆదేశించారు. ఆక్రమణ తొలగింపు పనులకు రైతులు సహకరించాలని కోరారు.