భీమవరం 38వ వార్డు లంకపేటలో దళిత ఇళ్లను తొలగించవద్దంటూ ఆ ప్రాంత వాసులు గురువారం ఆందోళన చేపట్టారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుందర్ కుమార్, జోసెఫ్ మాట్లాడుతూ.. డ్రైన్ ను అభివృద్ధి చేస్తామంటూ కుంటి సాకుతో పేదల కడుపు కొట్టవద్దని, పేదల ఇళ్లను తొలగించవద్దన్నారు. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాల కలుపుకుని నాయకులను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.