ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఎంతో సాహసోపేతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది అని... ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈనెల 10న అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం ఇప్పుడే వెంటిలేటర్ నుంచి సాధారణ పరిస్థితికి వచ్చిందని ఇలాంటి సమయంలో ఎవరు ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమాన్ని డబుల్ చేస్తూ అభివృద్ధిని కూడా రెట్టింపు చేసే స్థాయిలో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.