నిజామాబాద్ నగరంలోని వేణుమాల్ లో గల KFCలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. అయితే రెండు రోజుల క్రితం KFCలో చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు దుర్వాసన వచ్చింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. KFCలో ఉన్న చికెన్ నిల్వలను పరిశీలించారు. అనంతరం కస్టమర్లతో మాట్లాడారు. KFC నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిషన్లో దుర్వాసన రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెఎఫ్సి లోని ఫుడ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేశారు.