వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈరోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పార్టీ ముఖ్య నాయకులు 36 మంది బి ఆర్ ఎస్ లో చేరారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్టీలో చేరిన వారిలో రాయపర్తి మండలం జయరాం తండా ఎస్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బానోత్ రవి మాజీ ఉపసర్పంచ్ గుగులోతు సూర్య కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ బాధావత రమేష్ గుగులోత్ నరేష్ తదితరులు టిఆర్ఎస్ లో చేరారు.