జాన్పడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభం వైర్ తెగి దర్గా ఆవరణంలో ఉన్న అబ్దుల్ రహమాన్, బాషా, సైదాకు చెందిన పూజా సామగ్రి షాపులపై పడటంతో మంటలు అంటుకున్నాయి. షాపుల్లోని పూజా సామగ్రి పూర్తిగా ఖాళీ బూడిద అయ్యింది. సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.