Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమ వంశీతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతులతో సమావేశం నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గం త్వరలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతుల భూ సమస్యలను అర్జీల ద్వారా పరిష్కరించి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.