మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టబడిన ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం తెలిపారు. ఇటీవల నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ తమ్మిశెట్టి వరప్రసాద్, దాసరగొండ రవి, తోట రాజ్ కుమార్ ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరచగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలే చొప్పున జరిమానా విధిస్తూ, సాధారణ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.