రంగారెడ్డి జిల్లా నందిగామ మండల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టిన వీధి కుక్కలను మండల కేంద్రంలోని విక్టరీ గ్రౌండ్స్ లో వదిలేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడో పట్టిన కుక్కలను నందిగామలో వదిలేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్పటికప్పుడు వీధి కుక్కలను పట్టి సమీప ప్రాంతాల్లో వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీధి కుక్కలను దూర ప్రాంతాలలో, అడవులలో వదిలేయాలని కోరుతున్నారు.