చీమకుర్తి పట్టణంలోని ఇసుక వాగు సెంటర్లో శనివారం అధిక గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై ఒక పక్కకు ఒరిగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో లారీ యాజమాన్యం మరొక లారీని తీసుకువచ్చి గ్రానైట్ లోడును అందులోకి చేర్చారు. రోడ్డుపై పక్కగా ఒరిగిపోయిన గ్రానైట్ లారీని క్రేన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తొలగి, వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.