కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సును వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీటీసీ ఎయిడ్స్ కౌన్సిలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.... ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత లైంగిక సంపర్కం ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ రమేష్ బాబు పాల్గొన్నారు.