గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాలు సదుపాయాలను వెంటనే కల్పించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం 9:30 గంటలకు మోస్రా మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతమున్న భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామ పెద్దలు సూచన మేరకు ఇతర భవనంలోకి నాలుగు రోజుల్లో గ్రంథాలయాన్ని మార్చి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు పుస్తకాలు, న్యూస్ పేపర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.