Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: యనమదుర్రులో శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి పురాతన దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Bhimavaram, West Godavari | Sep 9, 2025
మంగళవారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి పురాతన దేవాలయమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఆలయ అర్చకులు మద్దిరాల సత్యనారాయణ, కొడమంచిలి చిన్న తమ్మిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఆశీర్వచనాన్ని అందించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తాహసిల్దార్ రావి రాంబాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us