శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో ఉన్న పోతుకుంట బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ధర్మవరం పట్టణానికి చెందిన నరసింహారాజు, సంతోష్, ప్రేమ్చంద్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ప్రేమ్చంద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారిని మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.