అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముస్టూరు గ్రామంలో మద్యానికి బానిస అయిన భర్త ఓబులేసు పై భార్య ఉల్లిగమ్మ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తొలుత ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. తీవ్ర రక్త గాయాలు కావడంతో మెరుగైన చికిత్సలకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనపై ఉరవకొండ ఎస్సై జనార్దన్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.