రైతులకు టిడిపి నాయకుని సంతకం ఉంటేనే సొసైటీలలో యూరియా ఇస్తున్నారని, రైతుకు రాజకీయ ముద్ర వేసిన దుర్మార్గమైన ప్రభుత్వ పాలన సరి కాదని వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం సాయంత్రం 6గంటలకు నరసరావుపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడుతూ రైతుకు చేరకుండా బ్లాక్ మార్కెట్ కు యూరియా వెళుతుందన్నారు. రూ. 266లు ఉండాల్సిన యూరియా,రూ. 400ల కు అమ్ముతున్నారని ఆరోపించారు. రైతుకు ఎరువులు' ఇవ్వాలన్నారు.