అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ భవాని అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదని కంట నీరు పెట్టారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు సుధాకర్, మహబూబ్ బాషా, పవన్ గౌడ్ లు సమస్యలపై గగ్గోలు పెట్టారు. అధికారులు కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలు నోట్ చేసుకొని పరిష్కరించాల్సింది పోయి వాటిని పట్టించుకోవడం లేదని చైర్ పర్సన్ భవాని ఏడ్చేశారు. ఓ మహిళ చైర్ పర్సన్ ను ఏడిపించడం సబబు కాదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు