సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, సుభాష్ నగర్ రామాలయం, ఖిల్లా రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.