ఎల్బీనగర్ పరిధిలోని సహభావన టౌన్షిప్లో ఉపాధ్యా య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యా యులను శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఉపాధ్యాయులు పోల్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలతో పాటు జీవన విలువలు నేర్పుతారని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెరుకూరి శ్రీనివాస్, విక్రమ్ రెడ్డి, అజయ్, కావాలి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.