సంతనూతలపాడు లో డ్యూమ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న డ్యూమా మరియు ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న సిబ్బంది శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన బొడ్డువారిపాలెం కు చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించి, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.60 వేలు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సహాయాన్ని శ్రీనివాసరెడ్డి పిల్లల చదువులకు వినియోగించాలని కుటుంబ సభ్యులకు వారు సూచించారు.