గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పశ్చిమ డివిజన్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఎస్పి సతీశ్ కుమార్, ఎస్డిపిఓ అరవింద్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. రికార్డులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలపై సమీక్ష చేసి, పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లలో శుభ్రత, పారదర్శకత, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్వ శ్రేష్ట త్రిపాఠి సూచించారు.