ఎస్ కోట మండల కేంద్రంలో వన్ వే ట్రాఫిక్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు నల్లయ్యను ఇసుకలోడుతో వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో కిందపడిన అతనిపై నుంచి ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ వెళ్లిపోవడంతో కొన ఊపిరితో ఉన్న వృద్ధుడిని ఎస్.కోట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిగా అక్కడ మృతిచెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ కోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.