రాజన్న సిరిసిల్ల జిల్లా ,తంగళ్ళపల్లి మండలం, పద్మ నగర్ గ్రామంలో భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఎలకల మందు సేవించి ఆత్మహత్య. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం పద్మనగర్ గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ అనే వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదని మన స్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎలుకలమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యం ధ్రువీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.