నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని SBI బ్యాంకు లోంచి ఐదు లక్షల నగదు చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన బ్యాంకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఐదు లక్షల నగదును చోరీ చేసి తీసుకెళ్లారు. అయితే గురువారం బ్యాంకు సిబ్బంది బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.