మహబూబాబాద్ మండలం ముడుపుగల్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు ఆదివారం సాయంత్రం 6:00 లకు వెలుగులోకి వచ్చింది.. దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు తాళాలు పగల కొట్టి 2.5 తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదును చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు.. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.