వరంగల్ భద్రకాళి ఆలయానికి నెల తిరగక ముందే నూతన EO ను రాష్ట్ర దేవదాయశాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈవోగా ఉన్న సునీతను తప్పించి సీనియర్ అధికారిని సంధ్యారాణిని ఈవోగా నియమించింది. గతంలో ఐదున్నర ఏళ్ల పాటు పనిచేసిన సునీతను నెల రోజులు తిరగకముందే తొలగించి వ్యవస్థానాన్ని మార్చడంపై రాజకీయ నేతల హస్తం ఉందని నగరంలో మాట్లాడుకుంటున్నారు. సునీత పై రాష్ట్ర ఇంప్రూవ్మెంట్ అధికారులకు సైతం కొన్ని ఫిర్యాదులు అందినట్లు సమాచారం.