ముత్యాలమ్మ వారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి సాధిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ వారి దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. సాంప్రదాయపద్ధంగా జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించాలని కోరారు. దేవస్థానం ఈవో పి. హరే రాంప్రసాద్, అన్నంనేడి భవాని రాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.