పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ రవీందర్రావు అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది అసహ్యించుకున్న ఇంకా ఆ పదవుల్లో ఎలా ఉండాలనిపిస్తుంది అని అన్నారు.. కెసిఆర్ అండతో బిఆర్ఎస్ పార్టీ సింబల్ తో గెలిచి ఇప్పుడు పార్టీ మారి కెసిఆర్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.. ఎమ్మెల్యేలు తమ పేరు ప్రతిష్టలతో గెలిచి ఉంటే ఎన్నికలకు పోవాలి కాని ఇలా దొంగచాటు రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.