హయత్ నగర్ డివిజన్లోని రంగనాయకుల గుట్టలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శనివారం ఉదయం ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. గ్యాస్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా సంబంధిత సిబ్బందితో మాట్లాడినట్లు కార్పొరేటర్ అన్నారు.