విశాఖ వాల్తేరు డిపోకు చెందిన 300C ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మంగళవారం గుండెపోటుతో మరణించారు. చోడవరం నుంచి విశాఖ వస్తున్న బస్సు పినగాడి వచ్చేసరికి ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు, బస్సు సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ అతనిలో చలనం లేదు. దీంతో బస్సులో పెందుర్తి PHCకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు బుచ్చయ్యపేట మండలానికి చెందిన పి.రాజేశ్ గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసింది