కామారెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదివారం కలిశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి సంతోష్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధిపై ప్రజాప్రతినిధుల పనితీరుపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పోషించిన పాత్రపై మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.