మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రజా పర్యటనలో భాగంగా కవల పిల్లలతో జన్మించిన బాలింత స్త్రీని పరామర్శించారు. సరదాగా ఆ స్త్రీ తన కొడుకుని మంత్రికి ఇస్తానని చెప్పగా, మంత్రి శ్రీహరి స్పందిస్తూ, "ఇప్పటికే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు... ఆడబిడ్డ ఇస్తే నా ఇంటికే తీసుకుపోతా" అని అన్నారు. ఆడబిడ్డలపై తనకున్న అమితమైన మమకారాన్ని వ్యక్తం చేస్తూ, అమ్మాయిల పుట్టుకే కుటుంబానికి అదృష్టమని, అమ్మాయి పుట్టిన ప్రతి ఇంటిలో సంతోషం నిండాలని ఆకాంక్షించారు.