అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని లచ్చానుపల్లి గ్రామ శివారులో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ కు చెందిన శేఖర్, ఆదిలక్ష్మి, దేవిలు పని నిమిత్తం లచ్చానుపల్లి గ్రామానికి వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తుండగా బైక్ బోల్తా పడింది. గాయపడిన ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు