శంషాబాద్ సమీపంలోని గండిగూడ వద్ద తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు కెమికల్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి, సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.