బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్ అవుట్ మరియు కిట్ ఆర్టికల్స్ చెకింగ్ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోధన్ ఏసిపి, బోధన్ రూరల్ సర్కిల్ CI బోధన్ రూరల్ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత,శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. బోధన్ రూరల్ PS పరిధిలోని రికార్డ్ లను పరిశీలించారు.