జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలపురం,వేములవాడ టౌన్, రూరల్ ప్రాంతాల్లో కూడా గురువారం.మధ్యాహ్నం,రాత్రి సమయంలో కురిసిన వర్షానికి రోడ్డుపైకి నీరు వచ్చి చేరింది.దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సంబంధిత అధికారులు రోడ్లకు మరమ్మత్తులు చేయాలని వర్షపు నీరుతో గుంతల మయంగా మారిన రోడ్డు దర్శనమిస్తున్నాయన్నారు. పలు వార్డులలో సైతం మట్టి రోడ్డు గుంతల మయంగా ఉండడంతో వర్షపు నీరు నిలిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.