మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ లో భారీ మోసం బయట పడిన సంగతి విదితమే. బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది 20 కిలోల బంగారం, కోటి రూపాయలు అపహరించారు. బ్యాంకులో పని చేస్తున్న క్యాషియర్ నరిగె రవీందర్ పాత్ర కీలకంగా ఉందని అధికారులు గుర్తించారు. బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా అని తమకు తెలపాలని ఖాతాదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బ్యాంక్ ఖాతాదారులకు గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తమకు బంగారం పైన పూర్తి వివరాలు వెల్లడించి, ఏ విధంగా లబ్ధిదారులకు చెల్లిస్తారో హామీ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఖాతాదారులు డిమాండ్ చేశారు.