మంచిర్యాల కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ లోకి సోమవారం అక్రమంగా ప్రవేశించి, జిల్లా కలెక్టర్ సీసీ బొడ్డు రాయలింగు డ్యూటీకి ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన చెన్నూరి సమ్మయ్య, జిలకర శంకరర్, జీడి సారంగం, లింగంపెల్లి శ్రీనివాస్, మంతెన మల్లేష్, గద్దల బానయ్యతో పాటు మరికొంత మంది పైన కేసు నమోదు చేసినట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి ఛాంబర్ వద్దకు వచ్చిన వారితో కలెక్టర్ లేరు.. తర్వాత రండి అని సీసీ వారితో చెప్పగా వాగ్వాదానికి దిగి, దౌర్జన్యంగా చేతులతో నెట్టి విధులకు ఆటంకం కలిగించి ప్రవేశించారని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ ఉపేందర్ రావు కేసు