కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో బుధవారం సముద్ర అలల తాకిడి పెరిగింది. నెల రోజులుగా మాయాపట్నంలో ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి భయానకంగా ఉందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.