మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడుతున్నామని మున్సిపల్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరులో గురువారం ఆయన మాట్లాడుతూ అలాగే, 20, 21 తేదీల్లో విజయవాడలో ధర్నా నిర్వహిస్తామన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.