నిజామాబాద్ నగరం పూసల గల్లిలోని బాలాజీ భవన్లో వినాయకుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుని చరిత్ర, లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో హిరణ్య కశ్యపుడు సంహారం చేసే విగ్రహాన్ని, ఆపరేషన్ సింధూర్ విగ్రహాలను ప్రతిష్టించి భక్తులను ఆకట్టుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి చిత్ర, విచిత్రాలతో ప్రతిష్టించిన విగ్రహాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పూసల సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక విచిత్ర రూపంలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తాము ప్రతిష్టించిన విగ్రహాలను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు.