విశాఖ స్థానిక జీవీఎంసీ పెందుర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి సత్యవతి అన్నారు. ఈమేరకు విశాఖ ద్వారకా నగర్ పవర్ గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. 2023 మార్చి 25 న పెందుర్తి ప్రాంతం ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి మూడు అంతస్తులు భవనము 158 గజాల ఆస్తిని బిల్డర్ విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని అగ్రిమెంట్ సమయంలో ఐదు లక్షలకు నగదు తీసుకున్నానని, అయితే అగ్రిమెంట్ మాత్రమే 15 లక్షలకు చేసి ఉన్నారని తెలిపారు.