రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారానే ఆ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తణుకు మండలంలోని రూ. 1.60 కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. మంత్రి భరత్ మాట్లాడుతూ.. ఇటీవల ఒక వైసీపీ మంత్రి మాట్లాడుతూ చంద్రబాబునాయుడిని వృద్ధాప్యంలో ఉన్నారంటూ కించపర్చుతూ మాట్లాడుతున్నారని ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.