పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ఎండలను తగ్గించుకుని గ్రీనరీ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు 25వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.