సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చెన్నై కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు గణేష్ విగ్రహాలకు పర్మిషన్ సంబంధించిన సమావేశం నిర్వహిస్తుండగా బి తాండకు చెందిన ఒక స్కార్పియో వాహనం స్టేషన్లకు రావడం జరిగిందని విచారించగా బి తాండ సేవాలాల్ నాయక్ తనదేమి తెలపడం జరిగిందని అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామంలో విచారించగా వీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సమాచారంతో స్కార్పియో వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు.