బోధన్ మండలం నాగన్పల్లి శివారు, మాచాపూర్ దారిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో ఉందని తెలిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.