జేఎన్టీయూ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని సిరిసిల్ల - కరీంనగర్ ప్రధాన రహదారి పై ధర్నా చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఎబివిపి,టిఆర్ఎస్వి నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు అదుపులో లకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. సోమవారం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం లో ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో తాత్కాలితంగా కొనసాగుతున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ తరగతి గదులకు, ల్యాబ్స్, మరుగుదొడ్లకు తాళం వేశారంటూ విద్యార్థులు ఆందోళన, రాస్తారోకో చేపట్టారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తాళం వేసారని,విషయం కలెక్టర్ కి పిర్యాదు చేశామని కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు.