నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బందార్లపల్లి గ్రామానికి చెందిన భాగ్య అనే యువతీ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందార్లపల్లి గ్రామానికి చెందిన భాగ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతుండేది. ఈ క్రమంలో పలు చోట్ల చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.