రాష్ట్రంలో బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు మనోవేదనకు గురవుతున్నారని ఏలూరులో బీజేపీ నేత అంబికా కృష్ణ అవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఎప్పుడు దొరుకుతుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పొత్తులు అవసరం లేదని అదిష్టానానికి అందరం విజ్ఞప్తి చేశామని అంబికా కృష్ణ వెల్లడించారు.